Rushi Sunak: తన అల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్పందన

Infosys Narayana Murthy response on Rushi Sunak elected as UK PM
  • బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రుషి సునాక్
  • నారాయణమూర్తి కుమార్తె అక్షత భర్తే రుషి
  • రుషి పట్ల ఎంతో గర్వంగా ఉందన్న నారాయణమూర్తి
భారత సంతతి వ్యక్తి రుషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర సృష్టించిన రిషి సునాక్ మరెవరో కాదు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడే సునాక్. నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తి భర్తే రుషి సునాక్. స్టాన్ ఫోర్డ్ యూనివర్మిటీలో ఎంబీఏ చదివేటప్పుడు వీరిద్దరికీ పరిచయమయింది. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలిశాయి. ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 

మరోవైపు, తన అల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై నారాయణమూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రుషికి శుభాకాంక్షలు తెలిపారు. రుషి పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ, మంచి పాలనను అందిస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు.
Rushi Sunak
UK
Narayana Murthy
Infosys
Prime Minister

More Telugu News