బఠానీ పువ్వుల రసంతో నీలి రంగు ఇడ్లీలు చేసిన మహిళ.. వీడియో వైరల్
- బఠానీ పువ్వులను ఉడకబెట్టిన నీళ్లను ఇడ్లీ పిండిలో పోసిన వైనం
- దానితో చూడచక్కటి నీలి రంగు ఇడ్లీలు తయారు చేసిన మహిళ
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్
జ్యోతి ముందుగా కొన్ని బఠానీ పువ్వులను నీటిలో ఉడకబెట్టింది. నీలి రంగులోకి మారిన ఆ నీటిని ఇడ్లీ పిండిలో చేర్చింది. ఇడ్లీ పాత్రలో సాధారణ ఇడ్లీ పిండిని, బఠానీ పువ్వుల నుంచి తీసిన నీళ్లు కలిపిన పిండిని వేర్వేరుగా ఉడకబెట్టింది. దాంతో, తెల్లటి ఇడ్లీలతో పాటు నీలి రంగు ఇడ్లీలు కూడా తయారయ్యాయి. అనంతరం రంగురంగుల ఇడ్లీలను ఓ పాత్రలో ఉంచిన జ్యోతి చట్నీ తో వడ్డించింది. ఈ వీడియోకు ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల వేలాది కామెంట్లతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు వెరైటీ ఇడ్లీలు చేశావంటూ జ్యోతిని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఇదేం వంట అని విమర్శిస్తున్నారు.