Brutain: బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్

liz truss resigns as britain prime minister
  • రిషి సునక్ తో పోటీ పడి ప్రధానిగా ఎన్నికైన ట్రస్
  • 45 రోజుల పాటు ప్రధానిగా కొనసాగిన వైనం
  • మినీ బడ్జెట్ నేపథ్యంలో ట్రస్ సర్కారుపై విమర్శలు
  • ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మంత్రుల రాజీనామా
  • మంత్రుల రాజీనామాతో ప్రధాని పదవి నుంచి వైదొలగిన ట్రస్
రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న బ్రిటన్ లో నెలలు తిరక్కుండానే మరోమారు సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదివి చేపట్టిన 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ప్రధాని పదవికి ట్రస్ రాజీనామాతో బ్రిటన్ లో మరోమారు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన ట్రస్... మినీ బడ్జెట్ ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

అప్పటికే దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేయలేక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ తో పోటీ పడి మరీ లిజ్ ట్రస్ విజయం సాధించారు. ఆపై మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ట్రస్ పాలనను గాడిలో పెట్టే దిశగా కాస్తంత దూకుడుగానే సాగారు. ఈ క్రమంలోనే ఆమె ప్రభుత్వం ఇటీవలే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 

మినీ బడ్జెట్ పై విమర్శలు చెలరేగడం, అందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ట్రస్ ప్రకటన విడుదల చేయం వెంటవెంటనే జరిగిపోయాయి. అదే సమయంలో దేశంలో ఆర్థిక సంక్షోభం మరోమారు పురి విప్పింది. ఫలితంగా ట్రస్ కేబినెట్ లోని పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రులు రాజీనామాలు చేయడంతో విధి లేని పరిస్థితుల్లో ట్రస్ ప్రధాని పదవికి రాజీనాామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా ట్రస్ కేవలం 45 రోజులు మాత్రమే కొనసాగారు. ఫలితంగా బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా ట్రస్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నారు.
Brutain
Liz Truss
Britain Prime Minister
Rishi Sunak

More Telugu News