Mowgli: మధ్యప్రదేశ్‌లో ‘మోగ్లీ’.. తువ్వాలుతోనే కళాశాలకు.. వీడియో ఇదిగో!

Meet Madhya Pradeshs Mowgli college boy who refuses to wear clothes but towel
  • మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీలో ఇంటర్ చదువుతున్న కన్నయ్య
  • దుస్తులు ధరించడమంటే మహా చిరాకు
  • కలెక్టర్ అనుమతితో దుస్తులు లేకుండానే పాఠశాలకు
  • ఇప్పుడు కాలేజీకి కూడా అలానే..
‘జంగిల్ బుక్’ సినిమా చూసిన వారికి మోగ్లీ గుర్తే. ఇప్పుడలాంటి మోగ్లీనే మధ్యప్రదేశ్‌లో దర్శనమిచ్చాడు. అయితే, ఈ మోగ్లీ ఉండేది అడవిలో కాదు.. జనారణ్యంలో. అంతేకాదు, ఈ మోగ్లీ కాలేజీలో చదువుతున్నాడు కూడా. అతడి పేరు కన్నయ్య. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచీ దుస్తులంటే తెగ చిరాకు. ప్యాంటు, చొక్కా వేసుకోమని సూచించే స్నేహితులతో మాట్లాడడమైనా మానేశాడు కానీ దుస్తుల జోలికి వెళ్లలేదు. దుస్తులంటే చిరాకు అతడితోపాటే పెరిగి పెద్దదైంది. తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినిపించుకోని కన్నయ్య ఇప్పుడు కాలేజీకి ప్యాంటు, షర్టుకు బదులుగా తువ్వాలు కట్టుకుని వెళ్తున్నాడు. మరి కాలేజీ యాజమాన్యం ఏమీ అనలేదా? అంటే కలెక్టర్ ఆర్డర్ ఉంది మరి!

ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరేందుకు వెళ్తే చేర్చుకునేందుకు యాజమాన్యం నిరాకరించింది. దీంతో కన్నయ్య కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించింది. చదువుపై అతడికున్న మమకారానికి కరిగిపోయిన కలెక్టర్ పాఠశాలలో చేరేందుకు అనుమతి కల్పించారు. ఆ తర్వాత కాలేజీలో అడ్డంకులు వస్తాయేమోనని భయపడి పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. అయితే, అందుకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. పాఠశాలలో చదువుకునేటప్పుడు కలెక్టర్ అనుమతి ఉండడంతో కాలేజీలో కూడా పెద్దగా కష్టపడకుండానే సీటు లభించింది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కన్నయ్య అండర్ వేర్, తువ్వాలు ధరించి మాత్రమే కాలేజీకి వస్తున్నాడు. తొలుత తోటి విద్యార్థులు వింతగా చూసినా ఇప్పుడు వారికీ అలవాటైపోయింది.
Mowgli
Madhya Pradesh Mowgli
Barwani
Jungle Book

More Telugu News