Vishwak Sen: ఏ గొడవా లేకుండా రిలీజ్ అవుతున్న నా సినిమా ఇదే: విష్వక్సేన్

Ori Devuda Diwali Daawath Event
  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'ఓరి దేవుడా'
  • ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న వెంకీ 
  • ఆయన అంకితభావాన్ని ప్రస్తావించిన విష్వక్సేన్ 
  • ఈ నెల 21వ తేదీన విడుదలవుతున్న సినిమా  

విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమా రూపొందింది. పీవీపీ సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. మిథిల పాల్కర్ - ఆషా భట్ కథానాయికలుగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'దీపావళి దావత్ ఈవెంట్' పేరుతో మరో ఈవెంటును నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లరి నరేశ్ .. సందీప్ కిషన్ .. కార్తికేయ .. తదితరులు హాజరయ్యారు. 

ఈ వేదికపై విష్వక్సేన్ మాట్లాడుతూ .. "మా సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ .. సాంగ్స్ అన్నీ కూడా ట్రెండింగ్ లో నడిచాయి. సినిమా రిలీజ్  తరువాత మరో రెండు పాటలను వదులుతాము. ఎక్కడ చూసినా ఆ పాటలనే పాడుకుంటారని నేను నమ్మకంగా చెబుతున్నాను. నా ప్రతి సినిమా విడుదలకి ముందు ఏదో ఒక లొల్లి జరుగుతూ వచ్చింది. ఈ సారి అలాంటి గొడవలేం లేకుండా ఈ సినిమా ప్రశాంతంగా విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు. 

"చాలా తక్కువ సమయంలో వెంకటేశ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. సెట్లో  ఆయన అంకిత భావం చూసి నేను షాక్ అయ్యాను. ఆయనే అంతలా కష్టపడుతుంటే మనమెంత చెయ్యాలి అనిపించింది. దీపావళికి ఈ సినిమా పెద్ద హిట్ కొడుతుందని భావిస్తున్నాము. మంచి కంటెంట్ ఉంటే ఆదరించే మీరు, ఈ సినిమాను మీ మనసులో పెట్టుకుంటారని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News