TDP: పంట పొలాల్లో కాలవ గట్లను దూకుతూ సాగిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో

tdp chief chandrababu naidu jumps canals in palnadu district
  • పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు
  • రైతుల సమస్యలపై ఆరా కోసం పొలాల్లోకి దిగిన టీడీపీ అధినేత
  • ఏ ఒక్కరి సాయం లేకుండానే కాలవ గట్లను దూకిన వైనం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వయస్సు 72 ఏళ్లు. అయినా కూడా యువకులకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. తాజాగా బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు.

ఈ సందర్భంగా పంట పొలాల్లో చంద్రబాబు చేసిన ఫీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పొలం గట్లపై బ్యాలెన్స్ ఎంతమాత్రం కోల్పోకుండా సాగిన చంద్రబాబు... కాలవ గట్లపై నుంచి దూకుతూ సాగారు. కాలవ గట్లపై చంద్రబాబు దూకుతూ ఉంటే...ఆయన వెంట సాగిన టీడీపీ నేతలు అలా చూస్తూ ఉండిపోయారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది అయితే అలర్ట్ అయిపోయారు. చంద్రబాబుకు ముందు కొందరు, ఆయన వెనుకాల కొందరు నిలబడి.. ఆయనకు సాయం అందించే యత్నం చేశారు. అయితే ఏ ఒక్కరి సాయం లేకుండా చంద్రబాబు కాలవ గట్లను దాటుతూ సాగిపోయారు.
TDP
Chandrababu
Palnadu District
Farmers

More Telugu News