Team India: గాయం నుంచి కోలుకున్న జడేజా... రన్నింగ్ చేస్తున్న వీడియో విడుదల చేసిన ఆల్ రౌండర్

ravindra jadeja posts a fresh video which shows he is in running
  • ఆసియా కప్ సిరీస్ లో గాయపడ్డ జడేజా
  • ఈ గాయం కారణంగానే టీ20 సిరీస్ కు దూరమైన ఆల్ రౌండర్
  • తన తాజా స్థితిని తెలుపుతూ వీడియో విడుదల చేసిన వైనం

టీమిండియా ఆటగాడు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి దాదాపుగా కోలుకున్నాడు. గాయం కారణంగా జడేజా కాలికి శస్త్ర చికిత్స జరగగా... దాని నుంచి కోలుకునేందుకు జడేజాకు చాలా సమయమే పట్టింది. ఆసియా కప్ సిరీస్ లో భాగంగా దుబాయిలో సహచర ఆటగాళ్లతో కలిసి అడ్వెంచర్ గేమ్స్ ఆడుతున్న సందర్భంగా జడేజాకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగానే టీ20 వరల్డ్ కప్ సిరీస్ కు కూడా జడేజా దూరమయ్యాడు.

ఈ గాయం తీవ్రమైనది కావడంతో అప్పటికప్పుడు ఆసియా కప్ సిరీస్ నుంచి జడేజా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే జడేజాకు ఆపరేషన్ కూడా జరిగింది. ఆపరేషన్ తర్వాత ఇంటికి చేరిన జడేజా ఊత కర్రల సాయంతో నడుస్తున్న తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా బుధవారం తన ఇంటిలోని జిమ్ లో రన్నింగ్ చేస్తున్న వీడియోను జడేజా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో గాయం నుంచి జడేజా పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నా... ఫిట్ నెస్ సాధించడమే కష్టమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News