MSP: రైతులకు కేంద్రం శుభవార్త... ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

 Atchannaidu challenges CM Jagan
  • ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్థిక కమిటీ భేటీ
  • వ్యవసాయానికి ఊతమిచ్చే నిర్ణయాలకు ఆమోదం
  • రబీ పంటలకు మద్దతు ధర పెంపు
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహం అందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు.

కేంద్రం నిర్ణయంతో మద్దతు ధర పెరిగిన పంటలు ఇవే...

1. ఎర్ర కందిపప్పు- క్వింటాలుకు రూ.500 పెంపు
2. ఆవాలు- క్వింటాలుకు రూ.400 పెంపు
3. కుసుమ - క్వింటాలుకు రూ.209 పెంపు
4. గోధుమలు- క్వింటాలుకు రూ.110 పెంపు
5. బార్లీ- క్వింటాలుకు రూ.100 పెంపు
6. శనగలు - క్వింటాలుకు రూ.105 పెంపు
MSP
Crops
Rabi
India

More Telugu News