'ఓరి దేవుడా' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే .. వేదిక ఎక్కడంటే!

  • విష్వక్సేన్ తాజా చిత్రంగా 'ఓరి దేవుడా'
  • ఇద్దరు కథానాయికల పరిచయం 
  • ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల  
Ori Devuda Pre Release Event Date Confirmed

విష్వక్సేన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'ఓరి దేవుడా' సినిమా రూపొందింది. పీవీపీ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. విష్వక్సేన్ సరసన నాయికలుగా మిథిల పాల్కర్ .. ఆశా భట్ కనిపించనున్నారు. కథలో కీలకంగా కనిపించే ప్రత్యేకమైన పాత్రను వెంకటేశ్ పోషించారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

తన తప్పులు తాను తెలుసుకుని తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి దేవుడి నుంచి మరో ఛాన్సును పొందిన ఒక యువకుడి కథ ఇది. మోడ్రన్ లుక్ తోనే ఈ సినిమాలో దేవుడిగా వెంకటేశ్ కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. హైదరాబాద్ .. మాదాపూర్ లోని 'దసపల్లా కన్వెన్షన్' లో రేపు ఈ వేడుక జరగనుందని అధికారిక ప్రకటన చేశారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది.

ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమా. అలాగే తనకి గల ఇమేజ్ నుంచి బయటికి వచ్చి విష్వక్ సేన్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేక పాత్రను పోషించడం మరో విశేషం. రొమాంటిక్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో విష్వక్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

More Telugu News