Amaravati: రాజమండ్రిలో అమరావతి రైతులపై చెప్పులు, బాటిల్స్ విసిరిన వైసీపీ శ్రేణులు

YSRCP followers attacked Amaravati farmers in Rajahmundry
  • రాజమండ్రిలో రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత
  • ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రైతులపై దాడి
  • పోటీపోటీగా నినాదాలు చేసిన రైతులు, వైసీపీ శ్రేణులు
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో పాదయాత్రగా వెళ్తున్న అమరావతి రైతులపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తున్నప్పుడు వారిపై చెప్పులు, వాటర్ బాటిల్స్ ను విసిరారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. సాక్షాత్తు మార్గాని భరతే అమరావతి రైతులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతులు, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.
Amaravati
Farmers
Padayatra
Rajahmundry
YSRCP
Attack
Margani Bharat

More Telugu News