TDP: ప్యాలెస్ పిల్లి భయపడింది: నారా లోకేశ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్య చేశారు. 'ప్యాలెస్ పిల్లి భయపడింది' అంటూ ఆయన ఓ సింగిల్ కామెంట్ తో కూడిన వ్యాఖ్య చేశారు. మంగళవారం నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కడప జిల్లా పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదట. ఈ విషయాన్ని తెలియజేస్తూ కడపకు చెందిన టీడీపీ నేత రాంప్రసాద్ కు రిమ్స్ పోలీసులు ఓ నోటీసును జారీ చేశారు.
అనుమతి లేకుండా కడప జిల్లాకు వస్తున్న నారా లోకేశ్ పర్యటనలో మీరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని సదరు నోటీసుల్లో రాంప్రసాద్ క రిమ్స్ పోలీసులు సూచించారు. తమ సూచనలను పట్టించుకోని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ ను పోలీసులు హెచ్చరించారు. ఈ నోటీసు కాపీని తన పోస్ట్ కు జత చేసిన నారా లోకేశ్ పై కామెంట్ చేశారు.