spiderman: నిండా జనం నిండిన రైల్లో స్టంట్లు.. ఇండియన్​ స్పైడర్​ మ్యాన్​ అంటూ సరదా కామెంట్లు!

  • కిక్కిరిసి ఉన్న రైలులో పైన రాడ్లు పట్టుకుని వేలాడుతూ ముందుకెళ్లిన యువకుడు
  • ‘ఏముంది మన దేశ రైళ్లు, బస్సుల్లో పరిస్థితి ఇదే కదా’ అంటూ నెటిజన్ల కామెంట్లు
  • ‘ఇతడిని స్పైడర్‌ మ్యాన్‌ అంటే అసలు స్పైడర్‌ మ్యాన్‌ చచ్చిపోతాడు’ అంటూ సరదా వ్యాఖ్యలు
Indian spiderman man uses unique technique to get to his seat viral video

రైలు కదులుతూ వెళ్తోంది. బోగీలో సీట్లు లేని ఖాళీ ప్రదేశంలో, సీట్ల మధ్యన జనం కింద కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. వారిని దాటి సీట్ల వద్దకు వెళ్లాలి. తన సీటులో కూర్చోవాలి. కానీ వెళ్లడానికి ఖాళీ లేదు. దీనితో బోగీలో పైన ఉన్న రాడ్లు పట్టుకుని వేలాడుతూ.. అలాగే ముందుకు కదులుతూ.. కింద కూర్చున్నవారిని దాటేశాడు. మొత్తానికి అవతలివైపు వెళ్లి కూర్చున్నాడు. రైలులో ఉన్నవారు ఈ వీడియో తీశారు.
 

  • ప్రొఫెసర్ ఎన్ జీఎల్ రాజాబాబు పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ‘భారత్ లో స్పైడర్ మ్యాన్ (స్పైడర్ మ్యాన్ భారత్ మే)’ అని దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోకు 45 వేలకుపైగా వ్యూస్, రెండున్నర వేలకుపైగా లైకులు వచ్చాయి.
  • ఈ వీడియోలో వ్యక్తిని స్పైడర్ మ్యాన్ అంటూ పేర్కొనడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. మన రైళ్లు, బస్సుల్లో అందరూ స్పైడర్ మ్యాన్ లే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
  • ‘ఈ వీడియోను అసలైన స్పైడర్ మ్యాన్ చూస్తే చచ్చిపోతాడు’.. ‘ఇతను స్పైడర్ మ్యాన్ ఏంట్రా బాబూ’.. ‘ఇలాంటి స్పైడర్ మ్యాన్ లు మాకు రోజూ కనిపిస్తూనే ఉంటారు..’ అని కామెంట్లు వస్తున్నాయి.
  • ‘పాపం.. మన దగ్గర బస్సుల్లో, రైళ్లలో పరిస్థితే అలా ఉంటుంది. ఎవరు మాత్రం ఏం చేయగలరు..’  అని కొందరు.. ‘ఎలాగైతే ఏంటి, సీటు దక్కిందా, కూర్చున్నామా అంతే’ అని మరికొందరు అంటున్నారు.

More Telugu News