Munugode: మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్​ వేసిన అభ్యర్థి

Candidate came on Horse to file namination at Munugode
  • నేతలు మందీ మార్బలంతో నామినేషన్ వేయడం మామూలే
  • వినూత్నంగా ఉండాలని గుర్రంపై నామినేషన్ వేసేందుకు వచ్చిన డాక్టర్
  • ఇదేదో భలేగా ఉందంటూ స్థానికుల వ్యాఖ్యలు
సాధారణంగా ఎన్నికలు అంటేనే అట్టహాసాలు, ఆడంబరాలు కనిపిస్తుంటాయి. అందులో నామినేషన్ అంటే కనిపించే హడావుడి అంతా ఇంతా కాదు. కొన్నిచోట్ల అయితే వేల మందితో ర్యాలీలు తీస్తూ నామినేషన్లు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో మాత్రం ఒక అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ వేయడం అందరినీ ఆకర్షించింది.

పోటీ కోసం వచ్చిన డాక్టర్
మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థి ఒక వైద్యుడు. పేరు వీరభోగ వసంతరాయుడు. హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన స్వస్థలం.. మునుగోడు నియోజకవర్గంలోని కుమ్మరిగూడెం. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి మునుగోడుకు వచ్చారు. ఇలా వినూత్నంగా గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అది చూసిన స్థానికులు భలేగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫొటోలు తీసి స్థానిక వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Munugode
By election
Telangana
Horse
Offbeat
Politcial

More Telugu News