Ambati Rambabu: నారా లోకేశ్ ఒక కమెడియన్.. బాలకృష్ణ అసమర్థుడు: అంబటి రాంబాబు

Ambati Rambabu satires on Balakrishna and Ambati Rambabu
  • వెన్నుపోటు రక్తపు మరకలను తుడిచేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారన్న అంబటి
  • ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్న
  • టీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
బాలకృష్ణ, నారా లోకేశ్ లపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బాలకృష్ణ అసమర్థుడు, అమాయకుడని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ ఒక హాస్య నటుడు వంటి వాడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు రక్తపు మరకలను తుడిచేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. తన స్వార్థం కోసమే బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్'లో చంద్రబాబు పాల్గొన్నారని విమర్శించారు. 

ఎన్టీఆర్ ను దించేయడంపై షోలో చంద్రబాబు మాట్లాడుతూ, వినకపోతే జుట్టు పట్టుకుని లాగామని అంటే... అది న్యాయమే, ధర్మమే అని బాలకృష్ణ అన్నారని అంబటి చెప్పారు. లోక కల్యాణం కోసమే ఎన్టీఆర్ ను దించేశారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని అడిగారు. ఎన్టీఆర్ బతికే ఉంటే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర గురించి మాట్లాడుతూ... ఫేక్ యాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమయ్యారని చెప్పారు. టీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
Ambati Rambabu
YSRCP
Chandrababu
Balakrishna
Nara Lokesh

More Telugu News