చార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మిన యాపిల్... రూ.164 కోట్ల జరిమానా విధించిన బ్రెజిల్ కోర్టు
- చార్జర్ సమస్యతో సతమతమవుతున్న యాపిల్
- సమస్యను పరిష్కరించకుండా చార్జింగ్ కేబుల్‌తో ఫోన్లు విక్రయిస్తున్న వైనం
- ఇదివరకే యాపిల్‌పై బ్రెజిల్ న్యాయ శాఖ 2 మిలియన్ డాలర్ల జరిమానా
- తాజాగా సావో పోలో సివిల్ కోర్టు 20 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన వైనం
ఐఫోన్ విక్రయాల్లో చార్జర్ సమస్య గత కొంతకాలంగా యాపిల్‌కు ఎదురవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణ హితం పేరిట చార్జర్‌లు లేకుండా కేవలం చార్జింగ్ కేబుల్ ఇస్తూ కొన్ని దేశాల్లో యాపిల్ తన ఐఫోన్లను విక్రయిస్తోంది. ఈ తరహా వ్యవహారంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రెజిల్ న్యాయశాఖ యాపిల్‌కు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ ఆదేశాలను అంతగా పట్టించుకోని యాపిల్ తాజాగా బ్రెజిల్‌లో చార్జర్ లేకుండానే ఐఫోన్‌ను విక్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రెజిల్ నగరం సావో పోలోలోని సివిల్ కోర్టు ఆ సంస్థకు 20 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.