5G: 5జీపై గర్విస్తున్నాం.. కావాలంటే ఇతర దేశాలకూ టెక్నాలజీ ఇస్తాం: నిర్మలా సీతారామన్​

  • భారతదేశంలో 5జీని పూర్తిగా దేశీయంగా రూపొందించామన్న కేంద్ర ఆర్థిక మంత్రి
  • కొన్ని పరికరాలను మాత్రం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నట్టు వెల్లడి
  • అమెరికా పర్యటనలో విద్యార్థులతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్
Indias 5g is indigenous we can provide to other countries as well

భారత దేశంలో 5జీ టెలికాం సర్వీసులను ప్రారంభించడం తమకు గర్వ కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఈ 5జీ టెక్నాలజీని పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేశామని.. కావాలంటే ఇతర దేశాలకు ఈ టెక్నాలజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ శుక్రవారం అక్కడి జాన్‌ హాప్కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్ డ్ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ లో విద్యార్థులతో మాట్లాడారు. భారత్ లో ఇటీవల 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు.

కొన్ని పరికరాలు మాత్రమే..
భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించినా.. ఇంకా ప్రజలకు పూర్తిస్థాయిలో అందాల్సి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 5జీ టెక్నాలజీలో చాలా భాగం దేశంలోనే అభివృద్ధి చేశామని.. దక్షిణ కొరియా వంటి ఇతర దేశాల నుంచి కొన్ని పరికరాలను మాత్రం తెప్పించుకున్నామని వివరించారు. 5జీ విషయంగా భారత్‌ విజయంపై గర్వపడుతున్నట్టు చెప్పారు.

More Telugu News