Smriti Irani: మోదీ తల్లిని కించపరుస్తూ మాట్లాడారు: స్మృతి ఇరానీ

Smriti Irani Lashes Out At AAPs Gujarat Leader
  • గుజరాత్ ఆప్ నేత గోపాల్ ఇటాలియాపై స్మృతి ఇరానీ ఫైర్
  • కేజ్రీవాల్ ఆశీస్సులతోనే అలా మాట్లాడారని విమర్శ 
  • గుజరాత్ ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెపుతారన్న స్మృతి
గుజరాత్ ఆప్ నేతలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ప్రధాని మోదీని ఉద్దేశించి గతంలో ఆప్ నేత గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. గోపాల్ గతంలో మాట్లాడిన వీడియోను ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు. మోదీ నీచమైన వ్యక్తి అని గోపాల్ అంటున్నట్టు ఆ వీడియోలో ఉంది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ని ఉద్దేశిస్తూ స్మృతి ట్వీట్ చేశారు. 'అరవింద్ కేజ్రీవాల్... మీ ఆశీస్సులతో మోదీ తల్లి హీరా బెన్ ను మురికి నోరైన గోపాల్ ఇటాలియా కించపరుస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై నేను ఆగ్రహాన్ని వ్యక్తం చేయను. గుజరాతీలు ఎంత కోపంగా ఉన్నారో చెప్పదలుచుకోలేదు. కానీ గుజరాత్ ఎన్నికల్లో మీ పార్టీకి గుజరాతీలు బుద్ధి చెపుతారు. ప్రజలే తీర్పును వెలువరిస్తారు' అని ట్వీట్ చేశారు. గోపాల్ ఇటాలియా గుజరాత్ ఆప్ కన్వీనర్ గా ఉన్నారు.
Smriti Irani
BJP
Narendra Modi
AAP
Arvind Kejriwal
Gopal Italia

More Telugu News