IT Raids: హైదరాబాదులో ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

IT raids on RS Brothers offices and residences in Hyderabad
  • ఏకకాలంలో 15 బృందాలతో ఐటీ దాడులు
  • ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి ఆర్ఎస్ బ్రదర్స్
  • ఆనర్స్ సంస్థ పేరిట స్థిరాస్తి కార్యకలాపాలు
  • మరో రెండు సంస్థలపైనా ఐటీ దాడులు

హైదరాబాదులో ఆదాయపన్ను శాఖ మరోసారి దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లోనూ, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. 

ఆర్ఎస్ బ్రదర్స్ ఇటీవల ఆనర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాసవి, సుమధర రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆనర్స్ పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ పైనే కాకుండా, వాసవి, సుమధర సంస్థలకు చెందిన ఆస్తులు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో మొత్తం 15 ఐటీ బృందాలు పాలుపంచుకున్నాయి.

  • Loading...

More Telugu News