Rahul Gandhi: ఏపీలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Rahul Gandhi Bharay Jodo Yatra enters into AP
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ సరిహద్దుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ భారత్ జోడో యాత్ర కాసేపట్లో డి.హీరేహాళ్ చేరుకోనుంది. రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సాయంత్రం ఓబుళాపురం మీదుగా ఆయన బళ్లారికి బయల్దేరతారు.
Go Back to Shorts
Rahul Gandhi
Bharat Jodo
Anantapur District
Andhra Pradesh
Congress
India

More Telugu News