ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. టేకాఫ్ అయిన వెంటనే ఊడిన 100 కేజీల బరువుండే టైరు: వీడియో ఇదిగో!

  • ఇటలీలోని టొరంటో విమానాశ్రయంలో ఘటన
  • చార్లెస్టన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్
  • ఊపిరి పీల్చుకున్న అధికారులు
Wheel of Boeing Dreamlifter Jet Falls to Ground During Take off in Italy

టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే 100 కేజీల బరువుండే విమానం టైరు ఊడి కిందపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటలీలోని టొరొంటోలో జరిగిందీ ఘటన. బ్రెజిల్‌కు చెందిన ఏవియేషన్ బ్లాగ్ ఏరోయిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన బోయింగ్ 747-400 డ్రీమ్ లైనర్ విమానాన్ని యూఎస్ కార్గో ఎయిర్‌లైన్ అట్లాస్ ఎయిర్ నిర్వహిస్తోంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని టైరు ఊడి కిందపడింది.

ఆ సమయంలో కార్గోజెట్ అండర్ క్యారేజ్ నుంచి నల్లటి పొగ రావడం కనిపించింది. కిందపడిన టైరును  టొరంటో-గ్రోటాగ్లీ విమానాశ్రయంలోని వైన్యార్డ్‌లో గుర్తించారు. బోయింగ్ సంస్థ ఈ ఘటనను ధ్రువీకరించింది. టొరంటో-గ్రోటాగ్లీ విమానాశ్రయం నుంచి అక్టోబరు 11న ఉదయం విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి వీల్ అసెంబ్లింగ్‌ను కోల్పోయి టైరు ఊడి కింద పడిందని తెలిపింది. అయితే ఆ తర్వాత విమానం చార్లెస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొంది. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News