Team India: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు వరుస ఎదురుదెబ్బలు.. దీపక్ చాహర్ ఔట్!

Deepak Chahar Ruled Out Of T20 World Cup
  • ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు
  • జడేజా, బుమ్రా.. ఇప్పుడు చాహర్ దూరం
  • షమీ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌లు ఆస్ట్రేలియాకు

టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వేధిస్తున్న గాయాల కారణంగా జట్టుకు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కాగా, తాజాగా మరో వికెట్ పడింది. మరో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్ జట్టులో స్టాండ్‌బైగా ఉన్న చాహర్.. గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో జట్టులోకి వస్తాడని భావించారు. అయితే, వెన్ను గాయం కారణంగా అతడు కూడా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో స్టాండ్‌బైగా ఉన్న మహ్మద్ షమీ, శార్దూల్, సిరాజ్‌లను ఆస్ట్రేలియాకు పంపాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

దీపక్ చాహర్ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించేందుకు సమయం చాలానే పడుతుందని, అతడి వెన్ను సమస్య మళ్లీ తీవ్రమైందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో షమీ, శార్దూల్, సిరాజ్‌లను ఆస్ట్రేలియా పంపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చే చాన్స్ సీనియర్ అయిన షమీకే ఎక్కువగా ఉంది.

  • Loading...

More Telugu News