ఈ ట్రాక్టర్​ ఎక్కడిదో చెప్తే.. ట్రాక్టర్​ మోడల్​ ను బహుమతిగా ఇస్తా.. ఆనంద్​ మహీంద్రా ఆఫర్​

  • మహీంద్రా ట్రాక్టర్ల వీడియో, ట్రాక్టర్ మోడల్ ఫొటోలతో క్విజ్ పెట్టిన మహీంద్రా
  • ఎక్కువ మంది మాత్రం అది జర్మనీ అయి ఉంటుందంటూ అంచనా
  • స్పెయిన్, బెల్జియం, ఆస్ట్రేలియా.. ఇలా చాలా దేశాల పేర్లు చెబుతున్న నెటిజన్లు
Anand mahindra latest twitter quiz a mahindra tractor replica reward

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ తో కలకలం రేపారు. ఈసారి ఏదో ఆఫ్ బీట్ వీడియో షేర్ చేయడం కాకుండా.. నెటిజన్లకు ఓ పరీక్ష పెట్టారు. మహీంద్రా కంపెనీకి చెందిన ట్రాక్టర్ల వీడియోను, దానికి సంబంధించిన చిన్నస్థాయి మోడల్ ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇందులో ఉన్నవి మహీంద్రా ట్రాక్టర్లు అని అందరికకీ తెలుసు. అయితే ఇది ఏ దేశంలోనో తెలుసా? ఎక్కడో సరిగ్గా చెప్పగలిగిన మొదటి వ్యక్తికి ఈ ట్రాక్టర్ మోడల్ ను బహుమతిగా పంపిస్తా” అంటూ ఆఫర్ కూడా చేశారు.

నెటిజన్ల నుంచి భారీ స్పందన

  • ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ వీడియోకు కేవలం నాలుగు గంటల్లో 4.6 లక్షలకుపైగా వ్యూస్ రావడం గమనార్హం. ఇదే సమయంలో 14.4 వేల లైకులు, 700కుపైగా రీట్వీట్లు నమోదయ్యాయి కూడా.
  • ఆనంద్ మహీంద్రా ప్రశ్నకు బదులుగా చాలా మంది నెటిజన్లు తాము ఊహించిన దేశం పేరును కామెంట్ చేస్తూ వస్తున్నారు. చాలా మంది అది జర్మనీ అని చెబుతున్నారు.
  • స్కాట్లాండ్ అని కొందరు, న్యూజిలాండ్ అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆఫ్రికా ఖండంలోని ఏదో ఒక దేశం అయి ఉంటుందని.. అది అమెరికానే అని ఇంకొందరు పేర్కొంటున్నారు.
  • స్పెయిన్, బెల్జియం, ఆస్ట్రేలియా, రొమేనియా, ఆస్ట్రియా, బ్రెజిల్ అయి ఉంటుంది అంటూ వేర్వేరుగా నెటిజన్లు కామెంట్లలో పెడుతూనే ఉన్నారు.
  • అయితే ఎక్కువ మంది మాత్రం అది జర్మనీయే అయి ఉంటుందని పేర్కొంటుండటం గమనార్హం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ వ్యవసాయ సీజన్ మొదలయ్యే సమయం. ఈ సమయంలో అక్కడ ‘అక్టోబర్ ఫెస్ట్ (Oktoberfest)’ పేరిట వేడుకలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇలా ర్యాలీ ఏర్పాటు చేస్తారని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News