Nokia G11 Plus: నోకియా నుంచి బడ్జెట్ ధరకే టాబ్లెట్.. జీ11 ప్లస్ స్మార్ట్ ఫోన్ విడుదల

  • జీ11 ప్లస్ ధర రూ.12,499
  • టీ10 టాబ్లెట్ ఎల్టీఈ వెర్షన్ విడుదల
  • ఇందులో రెండు రకాల వేరియంట్లు
  • రూ.12,799 నుంచి ధరలు ప్రారంభం
Nokia G11 Plus with 3 day battery life T10 tablet with LTE support launched in India

నోకియా బ్రాండ్ పై హెచ్ఎండీ గ్లోబల్ రెండు ఉత్పత్తులను విడుదల చేసింది. జీ11 ప్లస్ స్మార్ట్ ఫోన్ తో పాటు, నోకియా టీ10 ఎల్టీఈ టాబ్లెట్ విడుదలైన వాటిల్లో ఉన్నాయి. 

జీ11 ప్లస్ 
నోకియా జీ11 ప్లస్ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల స్క్రీన్, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ తో డిస్ ప్లే డిజైన్ చేశారు. యూనిసాక్ టీ606 ఆక్టా కోర్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేసే ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ. 12,499. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది.

టీ10 టాబ్లెట్
నోకియా గత నెలలోనే టీ10 టాబ్లెట్ వైఫై మోడల్ ను ఆవిష్కరించింది. తాజాగా ఎల్టీఈ సిమ్ తో పనిచేసే టాబ్లెట్ వెర్షన్ ను తీసుకొచ్చింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,799. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ రకం ధర రూ.13,999. వీటి విక్రయాలు ఈ నెల 15 నుంచి మొదలవుతాయి. 8 అంగుళాల డిస్ ప్లే ఉండే టీ10 టాబ్లెట్ యూనిసాక్ టీ 606 చిప్ సెట్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్, ముందు భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరాలున్నాయి. ఐపీఎక్స్2 రేటింగ్, 5,250 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జర్ తో వస్తుంది.

More Telugu News