Team India: ఆట మ‌ధ్య‌లో మైదానంలో వ‌చ్చిన వీధి కుక్క‌... సంజ్ఞ‌ల‌తోనే బ‌య‌ట‌కు పంపిన అయ్య‌ర్‌

team india player Shreyas Iyer sent a street dog with his signal from stadium
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌
  • ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండ‌గా మైదానంలోకి వ‌చ్చిన కుక్క‌
  • శ్రేయాస్ సంజ్ఞ‌ల‌ను పాటిస్తూ బ‌య‌ట‌కు వెళ్లిన వైనం
ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా ఆడిన మూడో వ‌న్డే సంద‌ర్భంగా ఓ ఆస‌క్తికర ఘ‌ట‌న చోటుచేసుకంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రుగ‌తున్న ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో మైదానంలోకి ఓ వీధి కుక్క ప్రవేశించింది. అయితే ఆ కుక్క‌ను టీమిండియా ప్లేయ‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌కు పంపేశాడు. గ్రౌండ్‌లోకి వ‌చ్చిన కుక్క వ‌ద్ద‌కు వెళ్లిన అయ్య‌ర్‌... దానికి చేతుల‌తో సంజ్ఞ‌లు చేస్తూ సాగాడు. అయ్య‌ర్ సంజ్ఞ‌ల‌ను అనుస‌రించిన ఆ కుక్క ఎట్ట‌కేల‌కు గ్రౌండ్ వీడి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. 

 మ్యాచ్‌ను చూసేందుకు వ‌చ్చిన ఫ్యాన్స్ స్టేడియం స్టాండ్స్‌లో నుంచి లేచి నిల‌బ‌డి మ‌రీ ఈ ఘ‌ట‌న‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జ‌ట్టును తొలుత బౌలింగ్‌తో చిత్తు చేసిన టీమిండియా ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో మెరుపులు ప్ర‌ద‌ర్శిస్తూ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. వెర‌సి టీ20 సిరీస్‌తో పాటు వ‌న్డే సిరీస్‌ను కూడా టీమిండియా గెలిచింది.
Team India
South Africa
Cricket
New Delhi
Arun Jaitley Stadium
Street Dog
Shreyas Iyer

More Telugu News