వానలో వలపుల సందడి : 'ఓరి దేవుడా' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

  • విష్వక్ సేన్ హీరోగా నిర్మితమైన  'ఓరి దేవుడా'
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా 
  • ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
Ori Devuda song released

విష్వక్సేన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'ఓరి దేవుడా' సినిమా చేశాడు. తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడి నుంచి మరో ఛాన్స్ పొందిన యువకుడి కథ ఇది. ఆశా భట్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, వెంకటేశ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. 

 కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా .. మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో ... హీరోయిన్లపై చిత్రీకరించిన పాట ఇది. లీన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 

కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుద్ ఆలపించాడు. బీట్ పరంగా ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. సతీశ్ కృష్ణన్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News