Kadapa District: గండికోట‌లో ఒబెరాయ్ హోట‌ల్స్ సీఈఓ అర్జున్ సింగ్‌... విష‌య‌మిదేన‌ట‌

oberoi hotels and resorts team visits gandikota kadapa district
  • ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సీఈఓ అర్జున్ సింగ్ నేతృత్వంలో బృందం
  • క‌డ‌ప‌లో ఒబెరాయ్ ప్ర‌తినిధి బృందానికి స్వాగ‌తం చెప్పిన క‌లెక్ట‌ర్‌
  • గండికోట‌లో హోట‌ల్ ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌
ఆతిథ్య రంగంలో దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న ఒబెరాయ్ హోట‌ల్స్ అండ్ రిసార్ట్స్‌ ప్ర‌తినిధి బృందం మంగ‌ళ‌వారం ఏపీలోని క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తోంది. ఒబెరాయ్ హోటల్స్ సీఈఓ అర్జున్ సింగ్ నేతృత్వంలో క‌డ‌ప‌కు వ‌చ్చిన ఒబెరాయ్ ప్ర‌తినిధి బృందానికి జిల్లా క‌లెక్ట‌ర్, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

అనంత‌రం క‌లెక్ట‌ర్ వెంట రాగా... ఒబెరాయ్ ప్ర‌తినిధి బృందం జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌ల ప‌రిధిలోని గండికోట‌కు చేరుకుంది. గండిపేట‌లో ఓ హోట‌ల్‌ను ఏర్పాటు చేసే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న ఒబెరాయ్ గ్రూప్ అందుకు కావాల్సిన స్థ‌ల ప‌రిశీల‌న‌కే త‌న బృందాన్ని గండికోట‌కు పంపిన‌ట్లు స‌మాచారం. గండికోట‌లో హోట‌ల్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూముల‌ను అర్జున్ సింగ్ ప‌రిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డి కానున్న‌ట్లు స‌మాచారం.
Kadapa District
Andhra Pradesh
YSRCP

More Telugu News