Shauryajit Khaire: పిట్ట కొంచెం కూత ఘనం... జాతీయ క్రీడల్లో చరిత్ర సృష్టించిన చిన్నారి అథ్లెట్

  • మల్లఖంబ్ క్రీడాంశంలో శౌర్యజిత్ ఖైరేకు కాంస్యం
  • ఖైరే వయసు 10 ఏళ్లు
  • గుజరాత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలుడు
  • జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు
Shauryajit Khaire set national games record by clinching medal as youngest athlete

సంప్రదాయ క్రీడ మల్లఖంబ్ కు జాతీయ క్రీడల్లో స్థానం కల్పించడం తెలిసిందే. తాజాగా, శౌర్యజిత్ ఖైరే అనే చిన్నారి అథ్లెట్  మల్లఖంబ్ క్రీడాంశంలో పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. 

శౌర్యజిత్ ఖైరే వయసు 10 ఏళ్లు. గుజరాత్ లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో ఖైరే కూడా పోటీపడ్డాడు. ఈ బాలుడు గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. జాతీయ క్రీడల మల్లఖండ్ ఈవెంట్ లో కాంస్యం సాధించాడు. ఈ క్రీడలో విశేష ప్రతిభ కనబర్చిన ఖైరే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతేకాదు, జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 

ప్రస్తుతం ఈ గుజరాత్ చిచ్చరపిడుగుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఖైరే మల్లఖంబ్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.

More Telugu News