Manchu Vishnu: 'జిన్నా' టెంట్ వేస్తే పెళ్లి ఆగిపోవలసిందే: మంచు విష్ణు

Manchu Vishnu Interview
  • మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా'
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్ 
  • కామెడీ కథకి హారర్ టచ్ ఇచ్చిన విష్ణు 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
మంచు విష్ణు హీరోగా 'జిన్నా' సినిమా రూపొందింది. తన సొంత బ్యానర్లో ఆయన నిర్మించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి మంచు విష్ణు స్పందించాడు. 

"ఈ సినిమాలో హీరో పేరు 'గాలి నాగేశ్వరరావు' .. కానీ అలా పిలిస్తే అతనికి కోపం వస్తుంది. అందువలన 'జిన్నా' అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఈ కథ అంతా కూడా నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. చిత్తూరు నేపథ్యంలో కథ నడుస్తుంది. అందువలన ఎక్కువ పాత్రలు ఆ యాస మాట్లాడతాయి. అది కూడా ఈ సినిమా హైలైట్స్ లో ఒకటి. 

 'జిన్నా' అప్పుచేసి మరీ ఒక టెంట్ షాప్ నడుపుతూ ఉంటాడు. అతను టెంట్ వేశాడంటే పెళ్లి ఆగిపోతుందనే సెంటిమెంట్ ఉంటుంది. అలాంటప్పుడు అతను ఎలా అప్పుతీర్చగలడు? అనే దగ్గర నుంచే కామెడీ మొదలవుతుంది. రెండున్నర గంటల సినిమాలో ఒక గంటపాటు ఆడియన్స్ నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. ఆ తరువాత కథలో 'చంద్రముఖి' తరహా యాంగిల్ ఉంటుంది. కానీ పాయల్ పై ఉంటుందా? సన్నీలియోన్ పై నడుస్తుందా? అనేది మాత్రం సస్పెన్స్" అంటూ చెప్పుకొచ్చాడు.
Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie

More Telugu News