YSRCP: మంచం కోడు త‌గిలి కొడాలి నాని మోకాలికి గాయం

kodani nani injured in gadapagadapaku programme in gudivada
  • గుడివాడ‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కులో పాల్గొన్న నాని
  • జ‌నం ఇళ్ల‌ల్లోకి వెళ్లి మ‌రీ వారితో మ‌మేక‌మైన వైనం
  • ఓ ఇంటిలో  మంచం కోడు త‌గిలి మోకాలికి గాయం
  • ప్యాంటు పైకి జ‌రుపుకుని మ‌రీ చూసుకున్న నాని
వైసీపీ కీల‌క నేత‌, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. వైసీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మంలో భాగంగా మంగ‌ళ‌వారం గుడివాడ‌లో ప‌ర్య‌టించిన నాని... జ‌నంతో మ‌మేక‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇళ్ల‌ల్లోకి వెళ్లి మ‌రీ వారితో ముచ్చ‌టించారు. త‌మ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.

ఈ క్ర‌మంలో ఓ ఇంటిలోకి వెళ్లిన నాని... ఆ ఇంటిలో మంచంపై కూర్చోబోయారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కుడి కాలు మంచం కోడుకు బ‌లంగా త‌గిలింది. దీంతో నాని మోకాలుకు గాయ‌మైంది. దీంతో ఒకింత ఇబ్బంది ప‌డ్డ నాని...అక్క‌డే కూర్చుని త‌న కాలికి ఉన్న ప్యాంట్‌ను పైకి జ‌రుపుకుని మ‌రీ ఏ మేర గాయ‌మైంద‌న్న విష‌యాన్ని చూసుకున్నారు. మంచం కోడు త‌గల‌డంతో క‌లిగిన నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు మోకాలిని చేతితో రాసుకున్నారు.
YSRCP
Kodali Nani
Gudivada
Krishna District

More Telugu News