David Warner: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం: డేవిడ్ వార్నర్

Aussies cricketer David Warner appreciates Allu Arjun who won filmfare award for Pushpa
  • ఇటీవల 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం
  • బెంగళూరులో కార్యక్రమం
  • 7 అవార్డులు కైవసం చేసుకున్న పుష్ప
  • పుష్ప యూనిట్ కు అభినందనలు తెలిపిన వార్నర్
  • పుష్ప మూవీ ఎంతగానో నచ్చిందని వెల్లడి
ఇటీవల బెంగళూరులో అట్టహాసంగా జరిగిన 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో పుష్ప చిత్రం ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు... ఇలా పలు విభాగాల్లో పుష్ప సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. దీనిపై ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. 

ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం క్లీన్ స్వీప్ చేయడం అభినందనీయం అని తెలిపాడు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం అని పేర్కొన్నాడు. పుష్ప చిత్రం తమకు ఎంతగానో నచ్చిందని వార్నర్ వెల్లడించాడు. పుష్ప యూనిట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నట్టు వివరించాడు. అంతేకాదు, తాను పుష్ప గెటప్ లో ఉన్న తన మార్ఫింగ్ ఫొటోను కూడా వార్నర్ పంచుకున్నాడు.

ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను సైతం కైవసం చేసుకుంది. 

కాగా, డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలంటే పడిచచ్చిపోతాడన్న సంగతి తెలిసిందే. ఈ ఆసీస్ విధ్వంసక ఆటగాడు టాలీవుడ్ స్టార్ హీరోలను అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అభిమానులను ఈ వీడియోలు ఎంతగానో అలరిస్తుంటాయి.
David Warner
Allu Arjun
Pushpa
Filmfare
Best Actor
Tollywood
Australia

More Telugu News