jntuh: విద్యార్థులకు జేఎన్ టీయూ తీపి కబురు.. ఇంటికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలు

  • బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు అవకాశం ఇచ్చిన జేఎన్‌టీయూహెచ్
  • ఈ నెల 14లోగా పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచన
  • కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా అవకాశం
exam centers near home town for jntuh students

తమ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు జేఎన్‌టీయూ (హెచ్‌) తీపి కబురు చెప్పింది. త్వరలో జరగనున్న సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను విద్యార్థులు తాము నివాస ప్రాంతాలకు సమీపంలోని కళాశాలల్లో రాసుకునే అవకాశం కల్పించింది. జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో చదివే బీటెక్‌, బీఫార్మసీ విద్యార్థులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించింది. 

ఈ మేరకు జేఎన్‌టీయూ (హెచ్‌) డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూయేషన్‌ ప్రొఫెసర్‌ చంద్రమోహన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్‌ 14 తేదీలోగా జేఎన్‌టీయూ స్టూడెంట్‌ పోర్టల్‌లో కళాశాల సెంటర్ల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ సమీపంలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయవచ్చన్నారు. కరోనా నేపథ్యంలో జేఎన్‌టీయూ రెండేళ్లుగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ ఏడాది కూడా ఇదే విధానం కొనసాగించనుంది.

More Telugu News