Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' పోరాట సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ ప్రాక్టీస్

Pawan Kalyan attends practice session for Harihara Veeramallu
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రం త్వరలోనే నూతన షెడ్యూల్ లో అడుగుపెడుతోంది. ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే సన్నివేశాలకు సంబంధించి గత కొన్నిరోజులుగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం హైదరాబాదులో వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ కు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతున్నారు. 

తాజాగా, ఈ పీరియాడిక్ చిత్రానికి సంబంధించిన పోరాట సన్నివేశాల రిహార్సల్స్ జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా తన సీన్లకు సంబంధించి ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. ఈ మేరకు ఓ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. తలను కూడా కవర్ చేసేలా డ్రెస్ ధరించి ఉన్న పవన్ కల్యాణ్ ఫైటింగ్ కు రెడీ అవుతుండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. 

కాగా, 'హరిహర వీరమల్లు' చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Harihara Veeramallu
Practice
Workshop
Hyderabad
Krish
Tollywood

More Telugu News