"దత్త తండ్రి తరఫున దత్తపుత్రుడి మియావ్ మియావ్" అంటూ పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యం

AP Minister Gudivada Amarnath satires on Pawan Kalyan
  • మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జన సభ
  • ఎందుకీ గర్జనలు అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నాస్త్రాలు
  • ఏంసాధించారని నిలదీసిన జనసేనాని
  • ట్విట్టర్ లో బదులిచ్చిన మంత్రి అమర్నాథ్
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఈ నెల 15న విశాఖలో గర్జన సభ నిర్వహించనుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందిస్తూ, ఎందుకీ గర్జనలు... రాష్ట్రాన్ని మరింత అధోగతి పాల్జేయడానికా? అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ మండిపడ్డారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. "దత్త తండ్రి చంద్రబాబు తరఫున దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ మియావ్ మియావ్" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

1.అంతర్జాతీయ రాజధాని మాస్కో 
2. జాతీయ రాజధాని ముంబయి 
3. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్
ఇవే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ త్రీ క్యాపిటల్స్ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Gudivada Amarnath
Pawan Kalyan
Chandrababu
Three Capitals
Andhra Pradesh

More Telugu News