Sabitha Indra Reddy: అమ్మా నిర్మలమ్మా... అంటూ కేంద్ర ఆర్థిక మంత్రికి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్

Sabitha Indrareddy counters union finance minister Nirmala Sitharaman
  • కేసీఆర్ తాంత్రికుల మాట నమ్ముతారన్న నిర్మల
  • అందుకే మహిళలను క్యాబినెట్లోకి తీసుకోలేదని వెల్లడి
  • తెలంగాణ క్యాబినెట్ లో ఇద్దరు మహిళలు ఉన్నారన్న సబిత
  • ఇంత చిన్న విషయం కూడా తెలియదా? అంటూ వ్యాఖ్యలు 
మహిళలకు రాష్ట్ర క్యాబినెట్ లో చోటిస్తే చెడు జరుగుతుందని తాంత్రికులు చెప్పడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలను క్యాబినెట్లోకి తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం తెలిసిందే. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. 

అమ్మా, నిర్మలా సీతారామన్ గారూ... తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులం ఉన్నాం అంటూ కౌంటర్ ఇచ్చారు. 

"నేను, నా కొలీగ్ సత్యవతి రాథోడ్ మంత్రులుగా పనిచేస్తున్నాం. గత మూడేళ్లుగా సీఎం కేసీఆర్ గారి ఘనతర నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మేం మంత్రులుగా సేవలందిస్తున్నాం. ఇద్దరు మహిళా మంత్రులు తెలంగాణ క్యాబినెట్ లో ఉన్నారన్న కనీస సమాచారం మీకు తెలియకపోవడం బాధాకరం" అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.
Sabitha Indra Reddy
Nirmala Sitharaman
Cabinet
KCR
TRS
BJP
Telangana

More Telugu News