BJP: చెన్నై మార్కెట్లో కూర‌గాయ‌లు కొన్న కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌... వీడియో ఇదిగో

union minister nirmala sitharaman purchages vegetables in chennai market
  • శ‌నివారం చెన్నై టూర్‌కు వెళ్లిన నిర్మలా సీతారామ‌న్‌
  • మైలాపూర్ మార్కెట్‌లో ఆగిన కేంద్ర మంత్రి
  • బుట్ట చేత‌బ‌ట్టి కూర‌గాయ‌లు ఏరుకున్న వైనం
త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శ‌నివారం ఉద‌యం నుంచి రాత్రి దాకా న‌గ‌రంలో బిజీబిజీగా గ‌డిపారు. త‌న షెడ్యూల్ మేర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను ముగించుకున్న నిర్మల... రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లో ఆగారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని కూర‌గాయ‌ల వ్యాపారులతో ఆమె మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆరా తీశారు. 

అనంత‌రం ఆమె ఓ దుకాణం వ‌ద్ద ఆగి కూర‌గాయ‌లు కొన్నారు. ఓ బుట్ట తీసుకుని కూర‌గాయల‌ను ఏరుకున్న నిర్మల... వాటిని కొనుగోలు చేశారు. కేంద్ర మంత్రి అయి ఉండి కూర‌గాయ‌ల మార్కెట్‌లో ఆగి కూర‌గాయల‌ను కొన్న మంత్రి వీడియోపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.
BJP
Nirmala Sitharaman
Tamilnadu
Chennai
Mylapore

More Telugu News