dont do: భోజనం తర్వాత ఈ పనులు చేయవద్దు..

  • స్నానం చేయడం సూచనీయం కాదు
  • దీనివల్ల జీర్ణక్రియలు నిదానిస్తాయ్
  • అధిక నీరు తాగకూడదు
  • తగినంత నిద్ర కూడా అవసరమే
Eight things you must never do after having a meal

మనకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. తప్పేమీ కాదు. కానీ, తెలియని విషయాన్ని అంగీకరించకపోవడం తప్పు. నిజానికి నిత్య జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటుంటాయి. వాటి పట్ల అవగాహన ఉండదు. నిపుణులు చెప్పినప్పుడు అయినా వింటే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. అటువంటివే ఇవీనూ..

భోజనం తర్వాత స్నానం
మనలో కొద్ది మంది భోజనం తర్వాత స్నానం చేస్తుంటారు. ముఖ్యంగా ఉక్కపోత వాతావరణం ఉన్నప్పుడు ఇలా చేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత జీర్ణాశయంలో జీర్ణక్రియలు మొదలువుతాయి. దీంతో పొట్ట భాగం చుట్టూ అధిక రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ సమయంలో స్నానం చేస్తే, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే కసరత్తు దానంతట అదే మొదలవుతుంది. జీర్ణాశయం చుట్టూ ఉన్న రక్తం తిరిగి చర్మం వద్దకు వెళ్లిపోతుంది. దీంతో జీర్ణక్రియ నిదానిస్తుంది. 

కసరత్తులు
భోజనం చేసి శారీరక కసరత్తులు చేయడం సూచనీయం కాదు. ఇది కూడా జీర్ణ ప్రక్రియను మందగింపజేస్తుంది. తల తిరగడం, కడుపులో నొప్పి, వాంతులు, కడుపులో మంటకు దారితీయవచ్చు.

నిద్ర
తిన్న వెంటనే పడక మంచం ఎక్కడం చాలా మందికి అలవాటు. దీనివల్ల జీర్ణరసాలు పైకి వచ్చేస్తాయి. దీంతో గుండెలో మంట కనిపిస్తుంది. నిద్ర లేచిన తర్వాత కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

అధిక నీరు
తిన్న తర్వాత అదే పనిగా నీరు తాగడం కూడా మంచిది కాదు. అధిక నీరు కడుపులోని జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియ నిదానించేందుకు దారితీస్తుంది. 

టీ/కాఫీలు
టీ, కాఫీల్లో ఫెనోలిక్ కాంపౌండ్లు ఉంటాయి. తిన్న ఆహారం నుంచి ఐరన్ తదితర పోషకాలను సంగ్రహించుకునే క్రమంలో ఇవి జోక్యం చేసుకుంటాయి. ఇక మద్యం తాగడం, పొగతాగడం కూడా మంచిది కాదు. వీటి కారణంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తాయి.

More Telugu News