Virat Kohli: ప్రముఖ గాయకుడికి చెందిన బంగ్లాను రెస్టారెంట్ గా మార్చేసిన కోహ్లీ

Kohli converts legendary Singer Kishore Kumar bungalow into restaurant
  • జుహూ ప్రాంతంలో కిశోర్ కుమార్ కు బంగ్లా
  • ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్న కోహ్లీ
  • వన్8 కమ్యూన్ గా నామకరణం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో ముందుకెళుతున్నాడు. 'రాంగ్' బ్రాండ్ తో ఫ్యాషన్ దుస్తుల రంగంలో ప్రవేశించిన కోహ్లీ, వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ ను కూడా ప్రారంభించాడు. 

అందుకోసం కోహ్లీ, బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన ఓ పాత బంగ్లాను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. ముంబయిలోని ఈ బంగ్లాను కోహ్లీ రెస్టారెంట్ గా తీర్చిదిద్దాడు. 

ఈ సరికొత్త రెస్టారెంట్ ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉంది. జుహూ... ముంబయిలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ కిశోర్ కుమార్ బంగ్లా గౌరీ కుంజ్ అంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడా బంగ్లా కాస్తా రెస్టారెంట్ గా మారిపోయింది. గాయకుడు కిశోర్ కుమార్ కు కోహ్లీ పెద్ద అభిమాని.
Virat Kohli
Kishore Kumar
Bungalow
Restaurant
Juhu
Mumbai

More Telugu News