Madhuri Dixit: రూ. 48 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొన్న మాధురీ దీక్షిత్

Madhuri Dixit buys luxurious apartment in Mumbai
  • ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఇంటి కొనుగోలు
  • ఎన్నో సదుపాయాలు కలిగిన విలాసవంతమైన ఇల్లు
  • అపార్ట్ మెంట్ నుంచి అందంగా కనిపించే అరేబియా సముద్రం
బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కు ఇప్పటికీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. కోట్లాది మంది ఇప్పటికీ ఆమెను అభిమానిస్తున్నారు. తాజాగా ఆమె ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. దాదాపు రూ. 48 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొన్నారు. 

53వ అంతస్తులో ఉన్న ఈ ఇంట్లో జిమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ పిచ్, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు ఈ అపార్ట్ మెంట్ నుంచి అరేబియా సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. 1990లో మాధురీ దీక్షిత్ అగ్ర కథానాయికగా కొనసాగారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు.
Madhuri Dixit
Bollywood
house

More Telugu News