కేసీఆర్ జాతీయ పార్టీకి అనూహ్య మద్దతు.. 8 రాష్ట్రాల నేతలు హాజరు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసే పోటీ చేస్తామన్న కర్ణాటక మాజీ సీఎం
- బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్
- పార్టీ పేరు మార్పు తీర్మానంపై సంతకం చేసిన 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు
- బీఆర్ఎస్ కు పూర్తి మద్దతును ప్రకటించిన కుమారస్వామి
ఈ సమావేశానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కుమారస్వామి పూర్తి మద్దతును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ తో కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ తిరుగుతారని చెప్పారు.