Telangana: క్వార్ట‌ర్ మద్యం, కోడిని పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత‌... వైర‌ల్‌ వీడియో ఇదిగో

a trs leader distributes a hen and a quarter liquor bottle to poor in warangal
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైన వేళ‌... వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌కవ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత రాజ‌నాల శ్రీహ‌రి చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. 

వ‌రంగ‌ల్‌లో న‌డిరోడ్డుపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్ క‌టౌట్ల‌ను ఏర్పాటు చేసిన శ్రీహ‌రి.. ఆ క‌టౌట్ల ముందు రెండు టేబుళ్లు వేసుకుని నిల‌బ‌డ్డారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఆ టేబుళ్ల‌పై కోళ్ల‌తో పాటు క్వార్ట‌ర్ మ‌ద్యం బాటిళ్ల‌ను పేర్చేశారు. అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తి పేద‌వాడికి ఓ కోడితో పాటు క్వార్ట‌ర్ మ‌ద్యం బాటిల్ ఇస్తానంటూ ఆయ‌న అనుచ‌రులు అప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

ఈ ప్ర‌చారం గురించి తెలుసుకున్న ప‌లువురు వ్య‌క్తులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకుని వ‌రుస‌లో నిల‌బ‌డ్డారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి వ్య‌క్తికి ఓ కోడితో పాటు క్వార్ట‌ర్ మ‌ద్యం బాటిల్‌ను శ్రీహ‌రి పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వ‌గా... దానిని పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు రీ ట్వీట్లు చేస్తూ పోయారు. ఫ‌లితంగా ఈ వీడియో వైర‌ల్‌గా మారిపోయింది.
Go Back to Shorts
Telangana
TRS
KCR
National Politics
Warangal East

More Telugu News