పెద్ద సినిమాలతో పాటు వస్తున్నందుకు భయం లేదు: 'స్వాతిముత్యం' హీరో

  • రేపు విడుదలవుతున్న 'స్వాతిముత్యం'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • పెద్ద సినిమాల పోటీ భయం లేదన్న హీరో 
  • తమది పండుగ సినిమానే అంటూ వ్యాఖ్య  
Swathimuthyam Movie Team Interview

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి జోనర్లో రూపొందిన సినిమానే  'స్వాతిముత్యం'. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. బెల్లంకొండ గణేశ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతూ ఉండగా, ఆయన జోడీగా వర్ష బొల్లమ్మ సందడి చేయనుంది. రేపు ఈ సినిమా విడుదలవుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ జంటను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. బెల్లంకొండ గణేశ్ మాట్లాడుతూ . "ఈ సినిమాలో నేను .. హీరోయిన్ ప్రేమించుకుంటాం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాము. పెళ్లి సమయానికి ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటాము .. ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడ్డామనేది కథ. కావాలని ఈ సినిమా కోసం ఖర్చు చేయలేదు. కథకి తగిన బడ్జెట్ తోనే ముందుకు వెళ్లడం జరిగింది. 

ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక మంచి సినిమాను చూశామనే ఫీల్ తోనే జనాలు థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. దసరాకి చిరంజీవిగారితో .. నాగార్జునగారితో కలిసి వస్తున్నాననే భయం లేదు. 'గాడ్ ఫాదర్' పొలిటికల్ డ్రామా అయితే, 'ది ఘోస్ట్' యాక్షన్ సినిమా. మా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వలన టెన్షన్ పడవలసిన అవసరం లేదు. పెద్ద హీరోల పోస్టర్ల పక్కన నా పోస్టర్ చూసుకోవడం ఆనందాన్ని ఇస్తోంది"  అంటూ చెప్పుకొచ్చాడు..

More Telugu News