Nagarjuna: నా విషయంలో అదంతా పుకారే: 'ది ఘోస్ట్' డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు

  • 'గరుడ వేగ'తో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు
  • తాజాగా ముస్తాబైన 'ది ఘోస్ట్' మూవీ
  • కథకి తగినట్టుగానే బడ్జెట్ ఉంటుందన్న ప్రవీణ్ సత్తారు 
  • కథను బట్టే హీరో అంటూ వ్యాఖ్య  
  • ఈ నెల 5వ తేదీన విడుదల  
Praveen Sattharu Interview

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' సినిమాను రూపొందించాడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ, " దర్శకుడిగా నా కెరియర్ ను 'గరుడ వేగ' సినిమాతోనే మొదలు పెడదామని అనుకున్నాను. కానీ దర్శక నిర్మాతగా నాకు అనుభవం లేకపోవడం వలన, అది భారీ బడ్జెట్ సినిమా కావడం వలన మొదటి సినిమాగా దానిని చేయలేదు" అన్నాడు.

'గరుడ వేగ' తరువాత మళ్లీ యాక్షన్ జోనర్లోనే చేద్దామనే ఉద్దేశంతో 'ది ఘోస్ట్' కథను లైన్లో పెట్టాను. నాగార్జున వంటి స్టార్ హీరోతో సినిమా చేయడం నాకు ఫస్టు టైమ్. స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని రకాల సందేహాలకు తెరదించిన తరువాతనే నాగార్జునగారు రంగంలోకి దిగారు. ఇది తల్లీ కూతుళ్లకు సంబంధించిన కథ. ఇద్దరూ కూడా ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు, హీరో వచ్చేసి ఆ సమస్యను పరిష్కరించి వెళ్లిపోతాడు'అని చెప్పాడు. 

నా సినిమాలకి బడ్జెట్ విషయంలో కంట్రోల్ ఉండదనే టాక్ ఉంది. 'గరుడ వేగ'కి ఎక్కువ ఖర్చు పెట్టించాననే పుకారు ఉంది. అంత భారీ సినిమాను 12 కోట్లలో చేశానంటే, బడ్జెట్ పై కంట్రోల్ ఉందనే అనుకోవాలి. తరువాత సినిమాను ఫలానా హీరోతో చేయాలని ముందుగానే ప్లాన్ చేయడం నాకు అలవాటు లేదు. కథను రెడీ చేసుకుని అందుకు తగిన హీరోనే సంప్రదించడం జరుగుతూ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News