Karnataka: పాము దొరికింది కదాని ముద్దుపెడితే.. మూతిపైనే కాటేసింది. వైరల్‌ వీడియో ఇదిగో

Karnataka man tries to kiss cobra after rescuing it gets bitten
  • పామును పట్టుకున్న సంబరంలో దానికి ముద్దిస్తూ ఫొటోలకు ఫోజిచ్చిన యువకుడు
  • తల భాగంలో కాస్త కిందికి పట్టుకుని ఉండటంతో.. వెనక్కి తిరిగి పెదవులపై కరిచిన నాగుపాము
  • కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఘటన.. యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్టు స్థానికుల వెల్లడి
ఓ చోట ఏదో పాము కనబడింది. చూస్తే నాగుపాము. భయంతో అందరూ దూరంగా పరుగెత్తారు. కానీ ఓ యువకుడు మాత్రం ధైర్యం చేసి పామును పట్టుకున్నాడు. దానితో కెమెరాలకు పోజులిస్తూ.. పాము తలపై ముద్దు పెట్టుకున్నాడు. అయితే తాను పాము తలభాగంలో దగ్గరగా పట్టుకోకుండా.. కాస్త దిగువన పట్టుకుని ఉన్నాడు. దీనితో పాము ఒక్కసారిగా తలను వెనక్కి తిప్పి అతడి పెదవులపై కరిచింది.

వేగంగా పారిపోయిన పాము
దీనితో షాక్ కు గురైన యువకుడు చేతులను వదులు చేసేయడంతో.. పాము చేతుల్లోంచి జారిపోయి కిందికి దిగింది. వేగంగా పాకుతూ పారిపోవడం మొదలుపెట్టింది. దానిని పట్టుకునేందుకు కొందరు ప్రయత్నించినా అప్పటికే అది పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ యువకుడి పేరు, వివరాలు బయటికి రాలేదు. అయితే అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని కొందరు పేర్కొన్నారు.
  • కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 87 వేలకుపైగా వ్యూస్, వందల కొద్దీ లైకులు వస్తున్నాయి.
  • పామును పట్టుకున్న యువకుడు ముద్దు పెట్టుకోవడం, అది తిరిగి పెదవులపై కరవడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.
  • ‘అతను పామును ముద్దు పెట్టుకుంటే.. పాము అతడిని తిరిగి ముద్దు పెట్టుకుంది’ అని కొందరు అంటుంటే.. ‘నాకే ముద్దు పెడతావా.. నీ సంగతి చూస్తా అన్నట్టుగా పాము దెబ్బతీసింది’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
  • ఇక కొందరు నెటిజన్లు ‘అయ్యో అతడికి ఏమైనా అయిందా? పాములతో జాగ్రత్తగా ఉండాలి కదా’ అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 
Karnataka
Cobra
Snake bite
Shivamogga
Offbeat
India

More Telugu News