Bandi Sanjay: బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా

Bandi Sanjay pada yatra postponed due to Munugode by poll
  • మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
  • ఉప ఎన్నికపై ఫోకస్ చేయనున్న బండి సంజయ్
  • రేపటి నుంచి మునుగోడులో మకాం వేయనున్న బీజేపీ కీలక నేతలు
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మరోవైపు, తెలంగాణలో బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే క్రమంలో బండి సంజయ్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర నాలుగు విడతలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని బండి సంజయ్ భావించారు. 

అయితే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఉప ఎన్నిక నేపథ్యంలో, రేపటి నుంచి బీజేపీ కీలక నేతలందరూ మునుగోడులో మకాం వేయబోతున్నారు.
Bandi Sanjay
BJP
Munugode
By Poll
Pada Yatra

More Telugu News