Prabhas: రాముడి పాత్రలో నటించేందుకు తొలుత నేను ఒప్పుకోలేదు: ప్రభాస్

I didnt accept to act in Ram character for first three days says Prabhas
  • తొలి మూడు రోజులు రాముడి పాత్రను పోషించేందుకు ఒప్పుకోలేదన్న ప్రభాస్
  • రాముడిపై భక్తి, భయంతోనే ఈ సినిమాలో నటించానని వ్యాఖ్య
  • నిన్న అయోధ్య రాముడిని దర్శించుకున్న సినిమా యూనిట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' టీజర్ ను నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రను ప్రభాస్, సీత పాత్రను కృతి సనన్, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. మరోవైపు నిన్నటి నుంచి ట్విట్టర్ లో 'ఆదిపురుష్' ట్రెండింగ్ లో ఉంది. ఇంకోవైపు, ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించాలన్నప్పుడు తొలుత తాను ఒప్పుకోలేదని ప్రభాస్ తెలిపారు. 

అయోధ్యలో టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ... రాముడి పాత్రను పోషించేందుకు తొలి మూడు రోజులు తాను ఒప్పుకోలేదని చెప్పారు. అయితే రాముడిపై ఉన్న భక్తి, భయమే 'ఆదిపురుష్'లో నటించేలా చేశాయని అన్నారు. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని చెప్పారు. మరోవైపు ఈ సినిమా యూనిట్ సభ్యులు అయోధ్యలోని రాముడిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.
Prabhas
Adipurutsh Movie
Tollywood
Bollywood

More Telugu News