google pixel 7: వేగంగా వచ్చేస్తున్న గూగుల్ పిక్సల్ 7 సిరీస్.. 6 నుంచి ప్రీ బుకింగ్

  • ఫ్లిప్ కార్ట్ పై బుకింగ్ కు ఏర్పాటు
  • 6వ తేదీ రాత్రి 9.30 నుంచి ప్రారంభం
  • వీటిల్లో గూగుల్ సొంత చిప్ సెట్ టెన్సార్ జీ2  
Pixel 7 series launching this week everything we know about Google new phones so far

గూగుల్ పిక్సల్ 6 సిరీస్ ఫోన్లు ఇటీవలే భారత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. నిజానికి వీటిని అమెరికా సహా పలు మార్కెట్లలో గూగుల్ గతేడాది అక్టోబర్ లోనే లాంచ్ చేసింది. కాకపోతే ఇక్కడికి రావడమే ఆలస్యం అయింది. దీంతో గూగుల్ పిక్సల్ 7 సిరీస్ ఫోన్ల విషయంలో ఈ పొరపాటుకు అవకాశం ఇవ్వరాదని గూగుల్ భావించినట్టుంది. అమెరికా మార్కెట్ తో పాటు ఒకేసారి భారత్ లోనూ వీటిని విడుదల చేయనుంది. 

గూగుల్ పిక్సల్ 7, పిక్సల్ 7ప్రోతో పాటు పిక్సల్ స్మార్ట్ వాచ్ ల ఆవిష్కరణ ఈ నెల 6న జరగనుంది. ఇవి భారత్ లోనూ అందుబాటులో ఉంటాయని గూగుల్ ప్రకటించింది. అక్టోబర్ 6 రాత్రి 9.30 గంటల నుంచి వీటి కోసం ప్రీబుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు కూడా గూగుల్ సొంత చిప్ సెట్ అయిన టెన్సార్ జీ2పై పనిచేయనున్నాయి. 

పిక్సల్ 7, 6.3 అంగుళాల స్క్రీన్ తో, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటే, పిక్సల్ 7 ప్రో 6.7 అంగుళాల స్క్రీన్, 120 హెర్జ్ ప్యానెల్ తో రానుందని సమాచారం. పిక్సల్ 6 సిరీస్ లో ఉన్న కెమెరాలే పిక్సల్ 7లోనూ కనిపించనున్నాయి. విడుదల తర్వాతే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

More Telugu News