ఇండోనేషియాలో విషాదం: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి
- తూర్పు జావా ప్రావిన్సులోని మలాంగ్‌లో ఘటన
- మైదానంలోకి దూసుకెళ్లిన ఓడిన జట్టు అభిమానులు
- అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- తొక్కిసలాటలో మరో180 మందికి గాయాలు
మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.