సమస్యలను పట్టించుకోవడం లేదని మనస్తాపం.. గొంతు కోసుకున్న వీఆర్ఏ

telangana VRA slits Throat in nekkonda
  • నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం వద్ద ఘటన
  • డిమాండ్ల సాధన కోసం 69 రోజులుగా  దీక్ష
  • ఆసుపత్రికి తరలించిన తోటి వీఆర్ఏలు
తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగిందీ ఘటన. వేతన సవరణ, పదోన్నతులు సహా పలు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన వీఆర్ఏ ఖాసిం.. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. 

వెంటనే అప్రమత్తమైన సహచర వీఆర్ఏలు అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ నెలల తరబడి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.
Go Back to Shorts
VRA
Warangal
Telangana
Nekkonda

More Telugu News