AP CID: చింతకాయల విజయ్ కి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందో వివరించిన ఏపీ సీఐడీ

  • హైదరాబాదులో విజయ్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సీఐడీ
  • టీడీపీ నేతల ఆగ్రహావేశాలు
  • స్పందించిన ఏపీ సీఐడీ
  • వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేశారని వెల్లడి
AP CID clarifies why its issued notice to Chintakayala Vijay

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాదులోని చింతకాయల విజయ్ నివాసంలో సీఐడీ పోలీసులు బీభత్సం సృష్టించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఐడీ స్పందించింది. 

చింతకాయల విజయ్ కి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించింది. సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేస్తున్నందునే విజయ్ కి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. 'భారతి పే' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ హస్తం ఉందని ఏపీ సీఐడీ ఆరోపించింది. 

కాగా, విజయ్ కి నోటీసుల వ్యవహారంలో ఇప్పటికే అయ్యన్న నిప్పులు చెరిగే విమర్శలు చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

More Telugu News