స్కూటీపై 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు' వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధ‌వి!... వీడియో ఇదిగో!

01-10-2022 Sat 18:58
  • అర‌కు ఎంపీగా కొన‌సాగుతున్న గొడ్డేటి మాధ‌వి
  • గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంలో... పాల్గొంటున్న వైనం
  • కారు వెళ్ల‌లేని గ్రామాల‌కు స్కూటీపై వెళ‌తున్న వైసీపీ ఎంపీ
  • సోష‌ల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన వైనం
ysrcp mp Goddeti Madhavi rides scooty in party programme
వైసీపీ మ‌హిళా నేత‌, అర‌కు పార్ల‌మెంటు స‌భ్యురాలు గొడ్డేటి మాధ‌వి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కారు వెళ్ల‌లేని గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ గ్రామాల‌కు కూడా చేరుకుంటున్న ఆమె జ‌నంతో మ‌మేక‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో సాధ్యమైనంత దూరం కారులోనే వెళుతున్న ఆమె... కారు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో చేరుకుంటున్నారు. 

కొండ‌లు, గు‌ట్ట‌లు ఉన్న ప్రాంతాల్లో స్కూటీపై వెళుతున్నారు. స్కూటీ కూడా వెళ్ల‌ని చోట్ల‌కు న‌డుచుకుంటూ వెళుతున్నారు. ఈ మేర‌కు అర‌కు నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని డుంబ్రిగూడ మండలం కించుమండ గ్రామపంచాయతీని సంద‌ర్శించిన సంద‌ర్భంగా ఆమె కొంత దూరం కారులో వ‌చ్చి... అక్క‌డి నుంచి స్కూటీని న‌డుపుకుంటూ మ‌రికొంత దూరం వెళ్లి... ఆపై న‌డుచుకుంటూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.